Sunil Gavaskar, former cricket legend, has joined the list. Sunil Gavaskar said that Pant was to play in World Cup.
#rishabhpant
#opener
#sunilgavaskar
#shanewarne
#australia
#indiavsaustralia
#kohli
#rohith
#bumra
#nehra
#dhawan
ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ జట్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉండాలనే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేరాడు. పంత్‌ను వరల్డ్‌కప్‌లో ఆడించాల్సిందేనంటూ సునీల్ గావస్కర్ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరిస్‌లో రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ సూచించిన విషయం తెలిసిందే.
తాజాగా ఇండియా టుడేతో షేన్ వార్న్ సలహా మంచిదేనని, ఈ దిశగా టీమిండియా ఆలోచించాలని గవాస్కర్ పేర్కొన్నాడు. అంతేకాదు పంత్‌ను ఓపెనర్‌గా ఆడించడం వల్ల వచ్చే నష్టం ఏం లేదని, అతను చెలరేగితో మిడిలార్డర్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు.పంత్ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్. ఎడమ-కుడి బ్యాట్స్‌మెన్ కాంబినేషన్‌ను ఎదుర్కొవడం బౌలర్లకు కష్టమైన పని. ఇలానే రోహిత్-ధావన్ కాంబినేషన్ విజయవంతమైంది. గతంలో సచిన్-గంగూలీ, సెహ్వాగ్-గంగూలీలు జోడిలు కూడా ఓపెనర్లుగా రాణించాయి. పంత్ కూడా ఓపెనర్‌గా రాణిస్తాడు. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం" అని గవాస్కర్ వివరించాడు